UPDATES  

 మృతునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రేగా…

మన్యం న్యూస్, మణుగూరు, ఏప్రిల్ 8: మండలంలోని చిక్కుడుగుంట గ్రామానికి చెందిన మునిగల తిరుపతయ్య (55) శనివారం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలియగానే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తిరుపతయ్య మృత దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని, తిరుపతయ్య మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !