UPDATES  

 ట్రాక్టర్ కల్తీ పడి పదిమందికి తీవ్ర గాయాలు* కూలి పనిలు చేసుకొని వస్తుండగా ప్రమాదం క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీపీ మంజు భార్గవి

మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి మండలంలో ట్రాక్టర్ పల్టీ పడి ఇప్పనపల్లి గ్రామానికి చెందిన పదిమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి సంఘటన స్థలానికి చేరుకొని గాయాల పాలైన వారిని పరామర్శించారు. ఎంపీపీ మంజు భార్గవి చొరవ తీసుకొని కొత్తగూడెం డి ఎం ఎం హెచ్ ఓ తో ఫోన్లో సంప్రదించి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. గాయాలు పాలైన వారందరినీ 108 వాహనం ద్వారా ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంబటే సంఘటన స్థలానికి చేరుకొని గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించడానికి త్వరగా చూపిన ఎంపీపీ మంజు భార్గవిని పలువురు అభినందిస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుబ్బారావు, హాతహర్, నాయకులు కిషోర్ బాబు, ఆరిఫ్ తదితరులు ఉన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !