UPDATES  

 తెలంగాణ పర్యటనకు మోడీ అనర్హుడు

తెలంగాణ పర్యటనకు మోడీ అనర్హుడు
– ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు ధారాధత్వం
– రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
– సిపిఎం రాష్ట్ర నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు

మన్యం న్యూస్, భద్రాచలం :
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు దారాధత్తం చేస్తున్న, భద్రాచలం నియోజకవర్గానికి ద్రోహం చేసిన నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు అనర్హుడని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు విమర్శించారు. శనివారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వద్ద నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రధాని అయిన నాటి నుండి కార్మిక, కర్శక, ప్రజావ్యతిరేక విధానాలను అమలుపరుస్తూ అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు మొదలగు హామీలు అమలు చేయకుండా సింగరేణి రైల్వే, విమానాయానం, మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు. వందే భారత్ రైలును ప్రారంభించడానికి వచ్చే నరేంద్ర మోడీ భద్రాచలం శ్రీ రామచంద్రునికి రైలు మార్గం ఎందుకు వేయడం లేదో సమాధానం చెప్పాలని అన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం వల్ల భద్రాచలానికి ముప్పు రాకుండా కేంద్రం రక్షణ చర్యలు చేపట్టాలనీ,
రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి ఎటపాక, గుండాల వైపు ఆంధ్రప్రదశ్ లో కరకట్టల నిర్మాణం ద్వారా భద్రాచలం రక్షణ భాధ్యత కేంద్రం చేపట్టాలని కోరారు. ఇందుకు పోలవరం నిధులు కేటాయించాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి.నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సరియం కోటేశ్వరరావు, సున్నం గంగా, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకట రామారావు, పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు యు.జ్యోతి, ఎన్.నాగరాజు, లక్ష్మణ్, కోరాడ శ్రీనివాస్, కుంజా శ్రీనివాస్, ఎస్.భూపెంద్ర, ఎంవీఎస్ నారాయణ, సతీష్, సోయం జోగారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !