UPDATES  

 మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతొ సింగరేణి కార్మికుల నిరసన*

మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతొ సింగరేణి కార్మికుల నిరసన*
పదకొండవ వేజ్ బోర్డును సత్వరమే పరిష్కరించాలి:డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. సారయ్య

మన్యం న్యూస్,ఇల్లందు:ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ పిలుపుమేరకు వివిధ మైన్స్, డిపార్ట్మెంట్ల వద్ద కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేకే ఓసీ, వర్క్ షాప్, కేఓసీ, ఏరియా హాస్పిటల్, జీఎం కార్యాలయాల్లో మోడీ గో బ్యాక్ అంటూ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అనంతరం జెకె ఓసిలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్కర్స్ యునియన్ డిప్యూటీ ప్రధానకార్యదర్శి కె.సారయ్య మాట్లాడుతూ… తెలంగాణలో ప్రధానమంత్రి మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నామని,
బొగ్గు గనుల ప్రవేటికరనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి కార్మికులపైన నల్ల చట్టాలను ప్రయోగిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. వెంటనే ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా పదవ వేజుబోర్డు కాలపరిమితి ముగిసి 21 నెల కావస్తున్నా ఇప్పటివరకు వేజుబోర్డు సమస్యను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వ జాప్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పేర్కొన్నారు. వెంటనే 11వ వేజ్ బోర్డును అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నామని అదేవిధంగా విదేశాలలో ఆదానికి చెందిన బొగ్గునులకు సంబంధించిన బొగ్గును 10 శాతంమేర దిగుమతి చేసుకోవాలని ,కార్మికులపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, బడా వ్యాపారవేత్తలకు కోట్లరూపాయల లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తున్నదని వెంటనే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సారయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో బ్రాంచి సహయ కార్యదర్శి దాసరి రాజారామ్, బ్రాంచి ఉపాద్యక్షులు ఎస్వీ రమణ, ఫిట్ కార్యదర్శులు సంజీవ చారి, మంచాల వేంకటేశ్వర్లు, కొడెం సుందర్, లచ్చిరామ్, జక్కుల శ్రీనివాస్, బొల్లెద్దుల శ్రీనివాస్, తిరుమల రావు, ముస్తఫా, అఫ్జల్,పైడిరాజు, జయరాజ్, అనిత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !