UPDATES  

 సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు, కార్యకర్తలపై ప్రజాపంథా భౌతిక దాడులను ఖండించండి

 

మన్యం న్యూస్ ఇల్లందు టౌన్..ఇల్లెందులో శనివారం ప్రతిఘటనోద్యమ నేత, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అమరుడు కామ్రేడ్ చండ్ర కృష్ణమూర్తి(ఎల్లన్న) విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంబించి, జెండా ఆవిష్కరణ చేస్తున్న సమయంలో ప్రజాపంథా ముఠా నాయకులు, కార్యకర్తలు..సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడి చేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు పిలుపునిచ్చారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు బండారి ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఎల్లన్న విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లడుతూ..సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం మరియు ఎల్లన్న విజ్ఞాన కేంద్రం ప్రారంభించుకుంటున్న తరుణంలో
ప్రజాపంథా విచ్చిన్నకర శక్తులు, గూండాలు మాపార్టీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతూ, జండాలను పీకి వేస్తూ,తోరనాలు చింపి భౌతిక దాడులకు పూనుకోవడం హైయమైన చర్య అని అన్నారు.ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. చర్చల సమయంలో సమావేశం పేరుతో ఆఫీసులను ఆక్రమించడం ప్రజాపంథా కు తగునా అని ప్రశ్నించారు. ఇలాంటి భౌతిక దాడులు, దౌర్జన్యాలను తిప్పి కొడతామని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాపంథా నాయకులు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవడానికి చిత్తశుద్దితో వ్యవహరించాలని హితవు పలికారు. లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. అనంతరం ప్రజాపంథా భౌతిక దాడులకు నిరసనగా ఇల్లందు పట్టణకేంద్రంలో ర్యాలీ కార్యక్రమం చేపట్టి , నిరసన తెలపడం జరిగింది. అమరవీరుల రక్తంతో తడిసిన ఇల్లందు గడ్డపై అనేక త్యాగాలతో, ప్రజల విరాళాలతో నిర్మించుకున్న ఎల్లన్నవిజ్ఞాన కేంద్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విప్లవకారుల మీద ప్రజాపంథా విచ్ఛిన్నకర శక్తులు భౌతిక దాడులకు స్వస్తి చెప్పి క్షమాపణ చెప్పాలని, చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాలను ప్రజాపంథా వాళ్లు అనవసర ఘర్షణలకు పాల్పడుతూ దాడులకు పూనుకొని కార్యకర్తలను, నాయకులను కొట్టడం పైగా మేమే వాళ్ల మీద దాడులు చేసినట్టు గోబెల్ ప్రచారం చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. మా ఓపికని, సహనాన్ని చేతగానితనంగా భావిస్తే జరిగే పరిణామాలకు ప్రజాపంథా నాయకులే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం, ఎల్లన్న విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికి విప్లవ జేజేలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మంజిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్,
గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, నాయకులు యాకన్న, భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, సీనియర్ నాయకులు రామటెంకి అంజన్న,
ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు తోడేటి నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణి, ఏఐకేఎంఎస్ కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కార్యదర్శిలు కందగట్ల సురేందర్, వై.ప్రకాష్, నాయకులు వెంకట్రామ్రెడ్డి, ఇఫ్టూ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్. సుభాన్, ఐ.వెంకన్న, పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు చింతా నర్సింహారావు, పర్షిక రవి, పీవైఎల్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గోరేపాటి రమేష్, పీఓడబ్లు జిల్లా అధ్యక్షురాలు వీరమల్ల ఉమ, కల్తీ సుభద్ర, ఖమ్మం జిల్లా కార్యదర్శి జానకి, ఎంపీటీసీ పాపక్క, సర్పంచులు సరోజిని, మోకాళ్ళ కృష్ణ, శ్రీను, సంతు, రజిత
నాయకులు నరేష్, కోరం సీతారాములు, యాసారపు సూర్నపాక నాగేశ్వరరావు, చిన్నస్వామి, సామెలు, మల్లయ్య, లక్ష్మన్న, ఎట్టి నరసింహారావు, కల్తీ వెంకటేశ్వర్లు, వజ్జ మధు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !