మన్యం న్యూస్, మణుగూరు, ఏప్రిల్ 9: మండలంలోని సి టైప్ గేటు వద్ద గల బాల వెలుగు పాఠశాలలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు సందర్బంగా దళిత బంధు లబ్ధిదారుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పది అన్నారు. మా అభిమాన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల, పట్టణ అధ్యక్షులు గంగారపు రమేష్, బూర్గుల సంజీవరావు, కట్టా రాజ్ కుమార్, భూమయ్య, ప్రభుదాస్, మేకల రవి, గుర్రం సృజన్, వేమూరి రఘు, బోయిల్ల రాజు, తాళ్లపల్లి నాగరాజు, డేగల సంపత్, సుజాత, శ్రీను, బాచి, ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.
