మన్యం న్యూస్, మణుగూరు, ఏప్రిల్ 9: రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు సందర్బంగా ఆదివారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో బిఆర్ఎస్వీ యువజన విభాగం, బీఆర్ఎస్ యువజన విభాగం, ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రేగా కాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రక్తదానం చేయడం వలన ఎందరో ప్రాణాలు కాపాడినవారు అవుతారన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన యువజన విభాగం, బీఆర్ ఎస్, ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,మణుగూరు సిఐ ముత్యం రమేష్,ఎస్సైలు రాజ్ కుమార్,పురుషోత్తం,బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,పార్టీ నాయకులు, యువజన నాయకులు, బీఆర్ఎస్వి నాయకులు,ఓబీ కాంటాక్ట్స్ వర్గం యూనియన్ నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.