UPDATES  

 కొత్తగూడెంలో రేగ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా.. జనహృదయనేత రేగన్న జన్మదిన వేడుకలు పోతురాజు రవి ఆధ్వర్యంలో రక్తదానం.. అన్నదానం

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మన్యంబిడ్డ మనసున్న మహారాజు జనహృదయనేత పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రేగ యూత్ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. రేగ యూత్ ముఖ్యులు పోతురాజు రవి ఆయన బృందం సారధ్యంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 70 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దీంతోపాటు స్థానిక బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాల్గొన్న టిఆర్ఎస్ జాతీయ పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు కర్నే మురళి, పోతురాజు రవి మాట్లాడారు. పినపాక శాసనసభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న రేగా కాంతారావు ప్రజల సంక్షేమం కోసం అన్ని వర్గాల ప్రజలకు ఇలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ అభయమిస్తున్నారని నిస్వార్ధమైన సేవకు సాక్ష్యంగా నిలిచిపోయారని అన్నారు. రేగా పుట్టినరోజు వేడుకలను కొత్తగూడెంలో రేగా యూత్ అభిమానుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే రేగా మరిన్ని పదవులను అలంకరించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. పినపాక నియోజకవర్గం లో రేగా గెలుపు కోసం రేగ యు సైన్యం ఒక సైనికులుగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే అన్వర్ రేగ యూత్ సభ్యులు కొలిపాక సతీష్, లాలు శ్రావణ్, సందీప్, షారుక్ ,డిఎంబి మధు ,సునీల్ సోహెల్, హరి ,బుద్ధి ,రిచ్ ,జహీర్, గరం సాయి, డీజే నవీన్, జోషి ,పవన్, భవాని, సాయి, శివ, భార్గవ్ మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !