మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రథమ మహాసభ స్థానిక సాహితీ డిగ్రీ కళాశాలలో వేముల గురునాథం అధ్యక్షతన ఆదివారం జరిగింది.ఈ సభలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, కచ్చల రంగారెడ్డి ముఖ్యఅతిదులుగా హాజరై మాట్లాడుతూ…దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు రెండుసార్లు అధికారంలోకి వచ్చినా కార్మికుల, దేశప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కిన పెద్దలు నేడు మాత్రం బడా పెట్టుబడిదారులకు భారతదేశ సంపదను దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు అత్యంత దుర్మార్గపు చట్టాలతో, దుర్గంధపు వాసనలో
పనిచేస్తున్నారని పనికితగ్గ వేతనాలు ప్రభుత్వాలు ఇవ్వడం లేదన్నారు. ఒక్కకలం పోటుతో శాసనసభలో పార్లమెంటులో
లక్షల రూపాయల జీతాలను పెంచుకుంటున్నారని ప్రభుత్వాలను దుయబెట్టారు.రాజ్యాంగం మీద ప్రమానం చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి మోడీలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం
ఇవ్వకుండా మొండికేస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా వారికిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలనీ, కార్మికులను పర్మినెంట్ చేసి జీతాలు పెంచి ఈఎస్ఐ,పీఎఫ్ వంటి అన్నిరకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ వారు చేశారు.మున్సిపల్ కార్మికుల ఈ మహాసభలో భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయాలని, కార్మికుల పోరాటాలకు అండగా ప్రజాపంధా
పార్టీ ఎల్లప్పుడు ఉంటుందని పేర్కొన్నారు.ఈ మహాసభలో మున్సిపల్ రాష్ట్రఅధ్యక్షులు జి.రామయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. మధుసూదన్ రెడ్డి, డి. ప్రసాద్, టీపీయండబ్ల్యు జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, గోనెల రమేష్, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.