మన్యం న్యూస్, భద్రాచలం :
భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరేలాగా రిటైర్డ్ ప్రిన్సిపల్ తిప్పన సిద్దులు బోధనలు ఉంటాయని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మానె రామకృష్ణ అన్నారు. సోమవారం భద్రాచలం శాఖ గ్రంథాలయం సైనిక బోర్డ్ సభ్యులుగా ఎన్నికైన భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ తిప్పన సిద్దులు నియమించడం పట్ల సన్మాన కార్యక్రమాన్ని గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి సన్మాన గ్రహీత తిప్పన సిద్దులు మాట్లాడుతూ… దేశంలోని బోర్డర్ లో పనిచేసి రిటైర్డ్ అయిన సైనిక కుటుంబాలకు అండగా ఉంటానని అన్నారు. నా పై నమ్మకంతో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు జిల్లాకలెక్టర్ కి, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మానె రామకృష్ణ, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు అరికెళ్ళు తిరుపతి రావు మాట్లాడుతూ… భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరేలాగా రిటైర్డ్ ప్రిన్సిపల్ తిప్పన సిద్దులు బోధనలు ఉంటాయన్నారు. ఇటువంటి విధ్యావంతుడికి ఈ యొక్క సైనిక బోర్డ్ మెంబర్ రావడం భద్రాచలం ప్రజలు హర్షం వ్యక్తము చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధికారప్రతినిధి బోట్ల రాంబాబు, తాళ్ళు రవికుమార్, చాట్లా రవికుమార్, సమగ్రమ, చారీ, శంకర్ రావు, బొట్టు శ్రీను, కృష్ణ, బి.ఆర్.కె.వి నియోజకవర్గం అధ్యక్షులు బషీర్, ఆహ్వాన కమిట గ్రంధాలయం చైర్మన్ మామిడి పుల్లారావు, గ్రంధపాలకులు జానీ తదితరులు పాల్గొన్నారు.