UPDATES  

 వర్కింగ్ జర్నలిస్టులకు పెండింగ్ అక్రిడేషన్ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి.. టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు పూదోట సూరిబాబు..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులతో పాటు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు గుండెబోయిన వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లా లలో రెండవ విడత అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాప్యం జరుగుతుందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా డివిజన్ మండల కేంద్రాలలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ఇంటి స్థలాలు కేటాయించి వారికి హక్కు పత్రాలు అందజేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీంతో సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆన్లైన్ చేసుకున్న ప్రతి జర్నలిస్టుకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని ఇంటి స్థలాల విషయం పరిశీలన ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కలెక్టర్ అనుదీప్ ని కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ జిల్లా నాయకులు వెలమ రాజేందర్, పర్సబోయిన రాధాకృష్ణ , ములకలపల్లి గోపీనాథ్, గోడ్డు గొర్ల నాగరాజు, రామదాసు రబ్బాని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !