మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చేరి వారి భవిష్యత్తును దిద్దుకోవాలని నాణ్యమైన విద్య బోధన అందుతుందని అన్ని రకాల సదుపాయాలు కల్పించబడతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులుకోరుతున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడతూ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు అన్ని రకాల సదుపాయాలతో నిర్వహించబడుతున్నాయని
ఏకలవ్య పాఠశాలల్లో 6వ తరగతిలో చేరిన విద్యార్థులు 12వ తరగతి వరకు నిరాటంకంగా ఆంగ్ల మాధ్యమంలో సిబిఎస్ఈ విద్యా విధానంలో విద్యాభ్యాసం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన ఉపాద్యాయులచే డిజిటల్
విధానం ద్వారా దృశ్య – శ్రవణ పద్ధతిలో విద్యా బోధన జరుగుతుందని చెప్పారు. విశాలమైన తరగతి గదులు అంతర్జాతీయ స్థాయిలో ఆట స్థలాలు, అత్యాధునికమైన వ్యాయామశాలలు, కంప్యూటర్ ల్యాబ్లు ఏకలవ్య పాఠశాలల ప్రత్యేకతని చెప్పారు. విద్యార్థిని, విద్యార్థుల యొక్క పరిపూర్ణ వికాసాన్ని పెంపొందించుటకు విద్యాబోధనతో పాటు
నాట్యము, సంగీతం, మరియు చిత్రలేఖనంలో నిష్ణాతులైన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థిని, విద్యార్థులు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకమైన
ఐఐటి, ఐఐఐటి, నీట్ పరీక్షల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. అడ్మిషన్లు ప్రక్రియ https://fastses.telangana.gov.in
ద్వారా చేయాల్సి ఉంటుందని, చివరి తేదీ ఈ నెల 20వ తేదీ వరకు ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య పాఠశాలల్లో బాలికలకు 690, బాలురకు 690 మొత్తం 1380 సీట్లు కలవని ఆయన పేర్కొన్నారు.
సలహాలు సందేహాలు నివృత్తి కొరకు జిల్లాలలోని సంబంధిత ఏకలవ్యవ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్ కానీ telanganaemrs@gmail.com లేదా హైదరాబాదు హెల్ప్ డెస్క్ నెంబరు 040-29551662 ఫోన్ చేయవచ్చునని ఆయన సూచించారు
అర్హతలు::
ఈ ఆర్థిక సంవత్సరానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాలలో 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50 వేలు కలిగి ఉండాలి.
7, 8 మరియు 9 తరగతుల్లో మిగిలిన సీట్లును కూడా ఈ విద్యా సంవత్సరం భర్తీ చేయడం జరుగుతుందని,
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఎయిడెడ్/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల/సిబిఎస్ఈ అనుబంధ పాఠవాలల్లో 5వతరగతి పూర్తి చేసిన అన్ని జిల్లాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.
6వ తరగతి ప్రవేశం కోరే విద్యార్థులు 10 నుంచి 13 సంవత్సరాలు కలిగి ఉండాలని, వికలాంగ విద్యార్థులకు
10 నుంచి 15 శాతం వైకల్యం కలిగిన వారై ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గండుగులపల్లి టేకులపల్లి ములకలపల్లి ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాల్ జి నాగేశ్వరరావు ,కె భద్రయ్య, కే స్వర్ణలత కే రాజేష్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు