UPDATES  

 సీఎం కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం*

  • సీఎం కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం*
  • భూ కబ్జాదారులు ఎవరో బహిరంగ చర్చకు సిద్ధమా?
  • పొంగులేటి, కోరం కనకయ్యలపై విమర్శనాస్త్రాలు సంధించిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిపై కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం సభలో రాష్ట్రప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పొంగులేటి, కోరం కనకయ్య, జూపల్లిలపై ఘాటు విమర్శలు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సోమవారం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ మాట్లాడుతూ…..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవర్తన ఒక గజిని, అపరిచితుడుని తలపిస్తుందని కేసీఆర్, కేటీఆర్ లని విమర్శించే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా మాజీ మంత్రిగా కొనసాగిన జూపల్లి కృష్ణారావు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ని పొగుడుతూ చంద్రబాబు నాయుడు ,రోశయ్యల కంటే కూడా సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడని, దేవుడు అని అన్నది మీరు కాదా అని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద బీఆర్ఎస్ పార్టీని పొగుడుతూ మీరు చేసిన ప్రసంగాల వీడియోలను ఒకసారి మీరే చూడాలని, లేదా మాకు అవకాశం ఇచ్చిన మేమే స్వయంగా మీ ప్రసంగాలను తిరిగి చూపిస్తామని అందుకు మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. నేడు సీతారామ ప్రాజెక్టు మీద మాట్లాడుతున్న కోరం కనుకయ్య ఆనాడు సీతారామ ప్రాజెక్టు పనులు ఆగిపోయినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది తమరేకదా మరి ఆనాడు ఎందుకు మీరు మాట్లాడలేదని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లందుకు ఏమీచేయని కోరం తను మాత్రం కోట్ల రూపాయలు ఆర్జించాడని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఓటమిపాలైన కనకయ్యకు కేసీఆర్ జెడ్పీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారని, అటువంటిది నేడు మీ రాజకీయ ఉనికి కోసం, మీ స్వలాభం కోసం సీఎం కేసీఆర్ ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా ఓడిన కనకయ్యకు పదవిని కట్టబెట్టిన మహనీయుడు కేసీఆర్ అని అట్టివ్యక్తిని మోసం చేసి పొంగులేటితో చేతులు కలిపిన విస్వసఘాతకుడు కోరం కనకయ్య అని విమర్శనాస్త్రాలు సంధించారు. కేసులు, భూకబ్జాల పేరుతో దందాలు నడుస్తున్నాయని మాట్లాడుతున్న కోరం కనకయ్య.. మీరు ఏవైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు ఒకసారి సరిచూసుకోవాలని ఈ భూకబ్జాల విషయంలో ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇల్లెందు గడ్డమీదికి వచ్చి మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఉంటే బహిరంగ చర్చకు వస్తారా అని సవాలు విసిరారు. ఏనాడు ఇల్లందు నియోజకవర్గ సమస్యల పట్ల అసెంబ్లీలో ప్రస్తావించని మీరు ఈరోజు మాట్లాడడం చూస్తుంటే చంటి పిల్లాడు మాటల్లాగా అనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీలోకి చేరి గులాబీ కండువా కప్పుకున్న 8 సంవత్సరాల తర్వాత ఆనాడు ఏ రోజు పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించని వారు నేడు స్వలాభం కోసం కన్నతల్లి లాంటిపార్టీని విమర్షించటం హాస్యాస్పదం అన్నారు. ఇన్నాళ్లు పార్టీలో కొనసాగిన మీరు వేలకోట్ల రూపాయలు కాంట్రాక్టు పనుల మీద సంపాదించి ఈనాడు వాపును చూసి బలుపు అన్నట్లుగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ ని విమర్శించే స్థాయి, అర్హత మీకు లేవని ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని రాబోవు కాలంలో ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ఘాటుగా విమర్శించారు. కెసిఆర్ నాయకత్వం నచ్చనప్పుడు ఇన్ని రోజులు పార్టీలో ఎందుకు కొనసాగారని, కేవలం పదవుల మీద ఆశతోనే పార్టీని వీడారని మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ నాయకత్వం నచ్చక పోతే స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెల్లుంటే కాస్తయినా గౌరవం దక్కేదని హరిప్రియ పేర్కొన్నారు. ప్రస్తుత జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న కోరం కనకయ్య దమ్ము ధైర్యం ఉంటే ఇల్లందు గడ్డమీద భూ కబ్జాల విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కోయగూడెం ఓసి వద్ద కోరం లక్ష్మీ పేరు మీద భూకబ్జాలు చేసిన నువ్వు నేడు ఏవైతే ఆత్మీయ పలకరింపుల పేరుతో ప్రతి ఇంటిని తడుతున్న తమరు ఆ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడగాలని అన్నారు. ఇంకోసారి కేసీఆర్ మీద , బీఆర్ఎస్ నాయకుల పట్ల స్వరం పెంచి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే మిమ్మల్ని రాళ్ళు, చెప్పులతో రోడ్లమీద పరుగెత్తించి కొడతారని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఇల్లందు మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, ఇల్లందు మండలపార్టీ అధ్యక్షుడు శీలం రమేష్, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు పెండ్యాల హరికృష్ణ, పివి కృష్ణారావు, ఇల్లందు పట్టణ అధికార ప్రతినిధి కుంట నవాబు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కీలక నేతలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !