మన్యం న్యూస్, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా పినపాకకు చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్ ను నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రకటించారు.ఈ సందర్భంగా సోమవారం మణుగూరులోని ఇల్లందు గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావును భవాని శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు. అనంతరం భవాని శంకర్ మాట్లాడుతూ,నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు విప్ రేగా కాంతారావు కు కృతజ్ఞతలు తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.