UPDATES  

 గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ శిక్షణ ఇవ్వాలి… గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ ఎస్డి నూర్ రబ్బాని…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 10 : గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ శిక్షణ ఇవ్వడంతో పాటు, గుర్తింపు కార్డులు సైతం మంజూరు చేయాలని గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ ఎస్డి నూర్ రబ్బాని ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన మండల స్థాయి గ్రామీణ వైద్యుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈనెల 12న లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఓం సాయిరాం ఫంక్షన్ హాలులో జిల్లా సమావేశం నిర్వహించడం జరుగుతుందని మండలంలోని గ్రామీణ వైద్యులందరూ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలన్నారు.ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు పంగా మల్లేశం, అతిథిగా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో మండల కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !