మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్ 11: అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రం అశ్వరావుపేట రింగ్ రోడ్డులో మంగళవారం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలమ్మ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో టి సేవ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోయం వీరభద్రం టీ సేవ్ లోగోను నిరుద్యోగ యువకులతో కలిసి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు పేరుతో 1200 మంది నిరుద్యోగులు బలిదానాలతో ఏర్పడ్డదని, బిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా పోటీ పరీక్షలకు సన్నధం అయ్యే నిరుద్యోగ అభ్యర్థులు ఆశలు నీరుగారుస్తూ పలు ప్రశ్నాపత్రాలు లీకేజ్ కి కారణం అవుతుందని, పేపర్ లీకేజ్ పై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. 2023 ఎన్నికల్లో నిరుద్యోగులు బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు కందుకూరి రాంబాబు, పెంకి వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి సోయం కృష్ణ, ప్రచార కమిటీ మోహన్ రావు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.