- పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రజాధారణ గల వ్యక్తి….
- -ఎంతోమందిని వివిధ హోదాలలో గెలిపించిన వ్యక్తి పొంగులేటి.
- -పార్టీ నుండి సస్పెండ్ చేయడం హేయమైన చర్య.
- -మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మన్యం న్యూస్, మణుగూరు ఏప్రిల్ 11: పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రజాధారణ గల వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన మంగళవారం స్థానిక హనుమాన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంతోమందిని వివిధ హోదాలలో గెలిపించిన వ్యక్తి పొంగులేటి అన్నారు. 2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే సీట్లు ఒక్క ఎంపీ సీట్లు గెలిపించిన ప్రజానాయకుడు పొంగులేటి అన్నారు. ప్రజల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సీఎం కెసీఆర్ బయటకు పంపారన్నారు. నేను ఉన్నాను శ్రీను అంటూ ఫాంహౌజ్ లో స్వయంగా మాట ఇచ్చిన కెసీఆర్, కేటీఆర్ నమ్మక ద్రోహం చేశారన్నారు. సింగరేణి ఎన్నికల్లో కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, కొమ్ముగుడెం, ఇల్లందు ఏరియాలో సింగరేణిలో గెలిచి ముఖ్యమంత్రికి గిఫ్ట్ ఇచ్చారన్నారు. 2019 ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని ఉదయంమే పార్టీ కండవ కప్పుకున్న వ్యక్తికి ఖమ్మం ఎంపీ సీటు ప్రకటించినా కానీ పార్టీ ఆదేశాల ప్రకారం ఆ వ్యక్తిని గెలిపించారన్నారు. పార్టీ లో ఎన్ని అవమానాలు జరిగిన సీఎం కెసీఆర్ పిలిచి మాట్లడతారేమో అని ఎన్ని సార్లు ఎదురు చూసిన ఉపయోగం లేదన్నారు. ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎదుగుదలను ఓర్వలేక పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఇది సరైన చర్య కాదన్నారు. బంగారు తెలంగాణ లో భాగస్వాములు కావాలని సీఎం కోరడంతో పార్టీలో చేరి అనేక ఎన్నికల్లో విజయానికి పొంగులేటి దోహద పడ్డారని, ప్రగతి నివేదన సభను జయప్రదం చేయడంలో పొంగులేటి పాత్ర కీలకమన్నారు. పదవులను సైతం లెక్కచేయకుండా త్యాగాలు చేసి అధిష్టానం నిర్ణయం మేరకు అభ్యర్థుల గెలుపుకు అహర్నిశలు కృషి చేశారన్నారు. పొంగులేటి సస్పెండ్ ఏదైతే ఉందొ అది సీఎం కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ఏర్పడిందని, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలన్నారు. గిరిజనులకు మూడు ఎకరాలు, ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎన్ని నిధులు ఖర్చు చేశారన్నారు. మాటలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేతల్లో చేసింది శూన్యమన్నారు. ఏది ఏమైనా రేపు రాబోయే కాలంలో శ్రీనన్న ప్రభంజనంను ఎవరు అడ్డుకోలేరన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, నెల్లిపాక పీఏసిఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి, మణుగూరు మండలం వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ లు పుచ్చకాయల శంకర్, గోరంట్ల కనకయ్య, తరుణ్ రెడ్డి, బాజి, ఏఎంసి డైరెక్టర్ గుండగాని నాగేశ్వరరావు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.