మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ దళ డిప్యూటీ కమాండర్, దళ సభ్యురాలను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు మంగళవారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.
సోమవారం మధ్యాహ్నం చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు 81బీఎన్, 141 బీఎన్, సిఆర్పిఎఫ్ సిబ్బంది కలిసి సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చత్తీస్గడ్ రాష్ట్రం ఉసూర్ దళ డిప్యూటీ కమాండర్ , ఒక దళ సభ్యురాలిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.అరెస్టు కాబడిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ డిప్యూటీ కమాండర్ దళ సభ్యురాలి వివరాలు ఇలా..
.బీమాపురం గ్రామం, జేగురుగొండ, సుక్మా జిల్లా, చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మడివి ఇడుమ 25 సంవత్సరాలు రాష్ట్రం, నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఉసూర్ దళ డిప్యూటీ కమాండర్. ఇతను 2010వ సంవత్సరం నుంచి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన బాలల సంఘం నందు పనిచేసి 2017వ సంవత్సరం నుంచి ఉసూర్
ఎల్ ఓ ఎస్ దళసభ్యుడిగా పనిచేస్తూ, 2021వ సంవత్సరం నుంచి ఉసూర్ ఎల్ ఓ ఎస్ డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్నాడు.
2.కుంజా దేవి@సరిత D/o. దేవా వయసు: 23 సం”,R/o. రేఖపల్లి గ్రామం, ఉసూర్ పి.ఎస్, బీజాపూర్, ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన కుంచాదేవి అలియాస్ సరిత, తండ్రి దేవా, 23 సంవత్సరాలు
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఉసూర్ ఎల్ ఓ ఎస్ దళ సభ్యురాలు. ఈమె 2021వ సంవత్సరం నుంచి ఉసూర్ దళ సభ్యురాలిగా పనిచేస్తున్నారు.
అరెస్టు కాబడిన పై ఇద్దరు సభ్యులు ఇతర దళ సభ్యులు, మిలీషియా సభ్యులతో కలిసి మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల ఆదేశాల ప్రకారం తెలంగాణ, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ఆదివాసీలను బలవంతంగా సమావేశాలకు తీసుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు వీరిని పట్టుకోవడం జరిగిందన్నారు.. అరెస్టు కాబడిన పై ఇద్దరు వ్యక్తులు
పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నట్లుగా విచారణలో తేలిందన్నారు.మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ అసలైన సిద్ధాంతాలను వదిలేసి, తమ స్వార్థప్రయోజనాల కోసం,
అక్రమంగా డబ్బులు సంపాదించడానికి తమ క్రింది స్థాయి కేడర్ ను వేధింపులకు గురిచేస్తున్నారని, నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేసే క్రింది స్థాయి నాయకులు, సభ్యులు వారి అగ్ర నాయకుల ఆదేశాల మేరకు ఏం చేయాలో అర్థంకాక తెలంగాణలో నివసించే ఆదివాసీలను కూడా వేధిస్తున్నారన్నారు. ఆదివాసి ప్రజలను బెదిరిస్తూ, డబ్బులు ఇవ్వకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో బూబి ట్రాప్స్, ఐఈడి లను అమార్చుతూ వారిని భయభ్రాంతులకు
గురిచేస్తున్నారని అన్నారు.మావోయిస్టులు ఈ విధంగా చేయడం వలన అక్కడ సంచరించే మూగజీవాలు, అమాయక ఆదివాసీలు తీవ్రంగా గాయపడటం, ప్రాణాలను కోల్పోవడం కూడా జరుగుతుందని,మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు
తీవ్రవాదులు లాగా వ్యవహరిస్తున్నారని అరెస్టయిన మావోయిస్టులు చెబుతున్నారని అన్నారు.
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహకరిస్తూ చట్ట వ్యతిరేక
కార్యకలాపాలకు పాల్పడుతూ, అమాయకపు ఆదివాసీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.అదేవిధంగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలపై ప్రజలలో ఆదరణ లేకపోవడం వల్ల ఈ సిద్ధాంతాలు విజయం సాధించలేవని నిర్ణయానికి వచ్చి ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకొని అనేకమంది మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు పోలీసు వారి సమక్షంలో లొంగిపోవడం జరిగిందన్నారు. మావోయిస్టు పార్టీ
నుంచి బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు స్వచ్ఛందంగా గానీ, బంధుమిత్రుల ద్వారా గాని తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో గాని లేదా జిల్లా పోలీసు ఉన్నతాధికారులను గానీ సంప్రదించగలరని భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేశారు.