మన్యం న్యూస్, మంగపేట.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గొప్ప వీరయ్యను కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి అన్నారు. మంగపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత పీడిత బాధిత బడుగు బల హీన వర్గాల ఆశాజ్యోతి సబ్బండ కులాలకు హక్కులు ప్రసాదించిన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పై గొప్ప వీరయ్య చేసిన వ్యాఖ్యలను మాల మహానాడు తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మండలం ఉన్న అన్ని కులాలు వారు అన్ని పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా దీని పై స్పందించాలని కోరారు. మనకు హక్కుల ప్రసాదించిన అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని ఇకనుంచి అయినా ఈ ప్రాంతంలో నివసిస్తున్న అన్ని వర్గాల ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండవ లసిన అవసరం ఉందని అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసు కోవాలని కఠినం శిక్షించాలని యాదగిరి అన్నారు.