మన్యం న్యూస్, దమ్మపేట, ఏప్రిల్ 11: మండల పరిదిలోని తాటిసుబ్బన్నగూడెం గ్రామంలోని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నివాసంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు, మోరంపుడి అప్పారావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమణ రావు, సర్పంచ్ లు నారం రాజశేకర్, దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, అశ్వారావుపేట టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, కాసాని చంద్ర మోహన్, తాడేపల్లి రవి, జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్, పోడియం వెంకటేశ్వరరావు, బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు.