మన్యం న్యూస్ కరకగూడెం: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జూనియర్ పంచాయతీ సెక్రటరీ లు తమ నాలుగు సంవత్సరాల ప్రోబిషన్ పూర్తయిన సందర్భంగా జడ్పిటిసి కొమరం కాంతారావు ఎంపీడీవో శ్రీను ఎంపీ ఓ ఆధ్వర్యంలో 16 పంచాయతీల కార్యదర్శి కేక్ కట్ చేశారు.తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం గ్రామపంచాయతిల సెక్రటరీలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో జూనియర్ పంచాయతీ అధికారులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించడం జరిగిందని వారన్నారు. మూడు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వారిని రెగ్యులర్ చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు పొడిగించిందని వారు అన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ నిరసన వ్యక్తం చేస్తూ తమను రెగ్యులర్ చేస్తామన్న హామీని తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో సమ్మెబాట పట్టాలనే నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. తమ పై అధికారులైన ఎంపీడీవో ఎంపీవో మండల ప్రజా ప్రతినిధులకు తాము ఈ విషయం తెలియజేయడం జరిగిందని వారు తెలిపారు. గ్రామాలలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను తీరుస్తూ గ్రామాల అభివృద్ధిలో పాటుపడుతున్న పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమను రెగ్యులర్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొమరం కాంతారావు 16 పంచాయతీల కార్యదర్శి శ్రీనాథ్, మధు,రవి,శ్రీజ,రమేష్, మారుతి,త్రినాథ్,తదితరులు పాల్గొన్నారు.
