మన్యం న్యూస్, మణుగూరు ఏప్రిల్ 12: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం మణుగూరు మండలం, మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలను సందర్శించి పరిశీలించారు. అనంతరం సుమారు 4 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడినుంచి బయలుదేరి మణుగూరు మున్సిపాలిటీలో కాలినడకన తిరుగుతూ మున్సిపాలిటీలోని డ్రైన్ లను పరిశీలించారు. డ్రైన్ల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేశారు. మెడికల్ షాప్, ఆసుపత్రుల నిర్వాహకులు ఈ వేస్టేజ్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా డ్రైన్లలో చెత్త, ఈ వేస్టేజ్ వేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, యాదగిరి గౌడ్, సంజీవరెడ్డి, గంగారపు రమేష్, రాజ్ కుమార్, రమణయ్య, కృష్ణ, రమణ, రవి, రమేష్, హర్ష, సృజన్, రాహుల్, నాగరాజు, సంపత్ పాల్గొన్నారు.
