- అంబేద్కర్ జీవితం భావితరాలకు స్ఫూర్తి
- ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేగా
మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని ఉప్పాక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించి దళిత బహుజనుల అభ్యున్నతే లక్ష్యంగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. చిన్న రాష్ట్రాలతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమని రాజ్యాంగంలో పొందుపరిచినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బందును అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి దళిత బంధును వర్తింప చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు ప్రపంచంలో చివర స్థాయిగా నిలిచిపోయేలా సెక్రటేరియట్ కు అంబేద్కర్ గారి పేరుతో నామకరణం, అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కు ఈనెల 14న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, డీఎస్పీ రాఘవేంద్రరావు, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.