మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
ఆదివాసి ప్రజానీకం ఐదవ షెడ్యూల్ హక్కుల చట్టాల కోసం సమిష్టిగా పనిచేయాలని ఆదివాసి జాతీయ సలహాదారుడు కొర్స వెంకటేశ్వరరావు సూచించారు. మండలంలోని గంగోలు పంచాయతీ రైతు వేదిక లో ఏవిఎస్పి, ఏఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కె.వి మాట్లాడుతూ ఆదివాసి ప్రజలు ఏజెన్సీలో ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేయడంలో విఫలం అవుతున్నారని అన్నారు మన ఆదివాసి హక్కులను మనమే సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ భద్రాచలం నియోజవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసి గ్రామాలు కమిటీ ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఏటి ఏ రాష్ట్ర అధ్యక్షులు జై బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన జీవోలను హక్కులను ఆదివాసి మేధావులు వాటిని కాపాడే దిశగా పనిచేయాలని ఆదివాసులకు భంగం కలిపించే చట్టాలను తీసుకువస్తే ప్రభుత్వంపై ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూప నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు నరసింహారావు ప్రధాన కార్యదర్శి సీతయ్య డివిజన్ అధ్యక్షుడు మల్లుదొర కొత్తపల్లి మాజీ సర్పంచ్ వీరాస్వామి రిటైర్డ్ విఆర్ఓ ఆదినారాయణ ఎర్రబూరు సర్పంచ్ బాలకృష్ణ వివిధ గ్రామాల ఆదివాసి పెద్దలు యువత పాల్గొన్నారు