మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రం ఎక్కెల గ్రామం సమీపంలో ఐటిడిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యాన వనాన్ని బుధవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ సందర్శించారు.
ఉద్యానవనంలో జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.మొత్తం 22 ఎకరాల విస్తీర్ణంలో పొదలనుతొలగించడం,దున్నడం,ఫెన్సింగ్ మొదలగు వాటిని పరిశీలించారు.ఈ ప్రాంతంలో 8 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల పెంపకం,2 ఎకరాల్లో ఇప్పటికే ఉన్న మామిడి తోటను అభివృద్ధి చేయడం మిగిలిన ప్రాంతంలోజామ,సపోటా,బత్తాయి, డ్రాగన్ పండ్ల తోటలను సాగు చేస్తామని హార్టికల్చర్ అధికారి తెలిపారు.ఆయిల్ పామ్,మామిడి తోటల సాగు పద్ధతులపై ఎస్టీ రైతులకు ప్రదర్శన శిక్షణ కోసం ఈ పొలాన్ని మోడల్ ఫామ్‌గా రూపొందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు.హార్టికల్చర్ అధికారి బివి రమణ మాట్లాడుతూ.భవిష్యత్తులో ఎస్టీ రైతులకు పండ్ల మొక్కల ఉత్పత్తి పంపిణీకి ఈ ప్లాంటేషన్,ఉపయోగపడుతుందని,తద్వారా వారి జీవనోపాధి రెట్టింపు ఆదాయం పెరుగు తుందని అన్నారు.ఈ పొలంలో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో ఉంటుందని,పూర్తిగా ఒకే వ్యక్తి ద్వారా నిర్వహించబ డుతుం దని,ప్లాంటేషన్ తర్వాత వివిధ ఉద్యాన పంటల సాగు ఉత్పత్తిపై ఎస్టీ రైతులకు శిక్షణా కార్యక్రమాలు కొనసాగు తాయని అన్నారు.