మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధి మంగవాయి బాడవ గ్రామానికి చెందిన పర్షిక జపన్న( 20 ) బుధవారం మృతి చెందాడు ఈనెల 7వ తేదీన ద్విచక్ర వాహనంపై రాత్రి సమయంలో భద్రాచలం వెళుతుండగా మండల పరిధి సీతారాంపురం నరసాపురం గ్రామాల మధ్య ట్రాక్టర్ ఢీకొట్టడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు కాగా కుటుంబీకులు భద్రాచలంలో ఓ ప్రైవేటు హాస్పటల్లో చేర్పించి చికిత్స ఇప్పిస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం విరిగిన కాలికి ఆపరేషన్ నిర్వహించారు ఆపరేషన్ ముందు వరకు స్పృహలో ఉండి అందరితో చలాకిగా మాట్లాడిన జంపన్న బుధవారం ఉదయం మరణించాడు దీంతో కుటుంబీకులు హాస్పిటల్లో అందించిన వైద్యంపై పలు అనుమానాలతో బుధవారం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై కేశవరావు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు ఇదిలా ఉండగా జంపన్న మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జంపన్న ను భద్రాచలంలో ఓ ప్రైవేటు హాస్పిటల్ (ఎముకలకు సంబంధించిన వైద్యం అందించే) లో చేర్పించక పరీక్ష చేసిన హాస్పిటల్ సిబ్బంది వైద్యులు కాలు విరిగినట్లు ఆపరేషన్ చేసి కట్టు వేస్తే నయమవుతుందని తెలిపినట్లు తెలిసింది కాగా ప్రమాదం జరిగిన నాలుగో రోజు జంపన్నకు కాలికి ఆపరేషన్ నిర్వహించగా మరుసటి రోజే మరణించడంతో కిడ్నీలపై ప్రభావం పడి మరణించాడని వైద్యులు హాస్పటల్ సిబ్బంది తెలిపినట్లు తెలిసింది దీంతో కుటుంబీకులు కాలికి ఆపరేషన్ చేస్తే కిడ్నీలు పాడవడం ఏంటని హాస్పిటల్ లో జాయిన్ చేసిన రోజు ఈ కిడ్నీలు సమస్య ఉందని తెలపని హాస్పటల్ సిబ్బంది జంపన్న చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని చెప్పడంపై సందేహపడ్డారు కాగా జంపన్న మృతిపై రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనపై మాత్రమే కేసు నమోదు చేసి దుమ్ముగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.