- ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు…
- -వైద్య ఆరోగ్య రంగానికి సీఎం కేసీఆర్ కృషి…
- -వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మౌలిక వసతుల అభివృద్ధి కోసం కోటి రూపాయలు నిధులు కేటాయింపు.
- -పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు ఏప్రిల్ 12: ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, బీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన బుధవారం స్థానిక వంద పడకల ఆసుపత్రిని సందర్శించారు. హాస్పిటల్ మౌలిక వసతులు, అభివృద్ధి కోసం కోటి రూపాయలు నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు , ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలు, బస్తి దవాఖానలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. మెరుగైన వైద్య సేవలు కలిపించేందుకు ప్రభుత్వం అదునాతన యంత్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటీసి పోశం నర్సింహారావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, యూసఫ్ షరీఫ్, సృజన్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.