మన్యం న్యూస్, దమ్మపేట, ఏప్రిల్ 12: మండల కేంద్రంలో బుధవారం నుంచి ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మ వారి 26వ తిరుణాల మహోత్సవంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మెచ్చాను, ప్రజా ప్రతినిధులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, పోతినేని వెంకట్ రావు, కేవి, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ దారా యుగంధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.