UPDATES  

 టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో పెను ప్రమాదంలో బాధితులకు నష్టం పరిహారం ఇవ్వాలి -కాంగ్రెస్ నాయుకులు

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 12: అశ్వారావుపేట మండలంలో టిపిసిసి సభ్యురాలు వగ్గెల పూజ స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న సందర్భంగా బాణాసంచా కాల్చిన ఘటనలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని, 10 మందికి కాళ్లు చేతులు విరిగి పడిపోయినాయి దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి చనిపోయిన వారికి కోటి రూపాయలు, కాళ్లు చేతులు విరిగిన వారికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బాధిత కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని టిపిసిసి సభ్యురాలు వగ్గేల పూజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బూసి పాండురంగ మాట్లాడుతూ ఇల్లు కాలిపోయిన వారికి కాళ్లు చేతులు విరిగిన వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు మహేష్, ఆసుపాక ఎంపీటీసీ వగ్గెల అనసూయ, వూకే ముత్తయ్య, వల్లి రాంబాబు. తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !