- చీమలపాడు అగ్నిప్రమాద ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి*
- ఏం వెలగబెట్టారని ఆత్మీయ సమ్మేళనలు?
- బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి యెర్రా కామేష్ సూటి ప్రశ్న..
.
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అధికార బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు ఏమి సంకేతాలు ఇవ్వడానికో అర్థం కావట్లేదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండలంలోని చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో నాయకులు,కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతికి,8 మంది క్షతగాత్రులు కావడానికి అధికార బీఆర్ఎస్ పార్టీ దే బాధ్యత అని అన్నారు.బాధిత కుటుంబాలకు ఎంపీ నామా నాగేశ్వరరావు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లు బాధ్యత వహించడమే కాకుండా బాధిత కుటుంబాల వారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అధికార బీఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారం చేజిక్కించుకున్నప్పటికీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ఇప్పటినుంచే పరోక్ష ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి పెద్ద మొత్తంలో డబ్బులను ఖర్చు చేస్తోందని ఆరోపించారు.అందులో భాగంగానే చీమలపాడు ఘటన చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీపావళి సందర్భంగా దుకాణదారులకు టపాకాయలు అమ్ముకోవడానికి లైసెన్సు ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెట్టే అధికారులు అధికార పార్టీ సభలు,సమావేశాలు,ర్యాలీలు,పాదయాత్రలకు ఏ విధంగా బాణాసంచా కాల్చేందుకు అనుమతులు ఇస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందన్నారు.వేసవికాలం మరి ముఖ్యంగా పూర్తి గ్రామీణ ప్రాంతమైన చీమలపాడు లాంటి ప్రాంతంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడమే ఎక్కువైతే అలాంటి ప్రదేశాలలో ఇష్టారాజ్యంగా బాణాసంచా కాల్చి ఇద్దరు మృతికి,ఎనిమిది మంది క్షతగాత్రులు కావడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.టిఆర్ఎస్ అధికారం లో ఉంది కదా అని తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తూ ఆత్మీయ సమ్మేళనం పేరుతో,అధికారం మదంతో తమను ఎవరు ప్రశ్నించారని తాము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తలంపుతోనే ఇంతటి అగత్యానికి ఒడిగట్టారని విమర్శించారు.ఇది పూర్తిగా బీఆర్ఎస్ చేసిన తప్పిదమని అన్నారు.ఈ ఘటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు,వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లు బాధ్యత వహించి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని,క్షతగాత్రులైన వారికి 50 లక్షలు ఇవ్వడంతో పాటు పూర్తి వైద్య ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని,మృతి చెందిన వారి కుటుంబ సభ్యులో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సలహదారుడు గంధం మల్లికార్జున రావు,సాయి,చెనిగారపు నిరంజన్ కుమార్,మాలోత్ వీరు నాయక్,వేణు తదితరులు పాల్గొన్నారు