UPDATES  

 గ్రంథాలయం లో ఘనంగా కవిసమ్మేళనం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

డా.బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంధాలయం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ ఇతివృత్తంగా బుధవారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ శ్రీ దిండిగల రాజేందర్‌ అధ్యక్షత వహించగా , ముఖ్య అతిథిగా ప్రముఖ కవి ఎం ఆర్ జి కె మూర్తి విచ్చేసారు. గ్రంథాలయ డైరెక్టర్లు మోరె భాస్కర్ రావు అక్కిరాజు గణేష్ , వరలక్ష్మీదేవి, జి. మణిమృదుల, నవీన్ ఆఫీస్ ఇంచార్జ్ శాఖ గ్రంథ పాలకులు మధుబాబు గ్రంథాలయ సిబ్బంది , పరీక్షార్థులు , ప్రముఖ కవులు హాజరై కార్యక్రమం జయప్రదం చేసారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవయిత్రి , రచయిత్రి , రేడియో వ్యాఖ్యాత , ఉపాధ్యాయిని తురుమెళ్ళ కళ్యాణి అను సంధాన కర్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కవి సమ్మేళనం అనంతరం కవితా గానం తో అలరించిన కవివరేణ్యులైన బుచ్చయ్య , చిట్టి మధు , కృష్ణ , రాజేష్ లను, కళ్యాణి, .పద్మ లను చిన్నారి తేజస్విని ని ఛైర్మన్ , అతిథులు దుశ్శాలువాలతో సత్కరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !