మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ అధికార ప్రతినిధి కుంట నవాబు మామ లోధ్ దుర్గాప్రసాద్ 25వ వర్ధంతిని పట్టణంలోని 4వ వార్డులో వారి ఇంటివద్ద బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ, ఏఎంసీ చైర్మన్ హరిసింగ్ నాయక్ హాజరై దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాలుగవ వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఆజాం, ఇరవైనాలుగవ వార్డు కౌన్సిలర్ వాంకుడోత్ తార, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు ఎస్కే పాషా, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సనా రాజేష్, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు మండల కోప్షన్ సభ్యులు ఘాజి, ఇంద్రనగర్ వార్డ్ మెంబర్ నీలం రాజశేఖర్,యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
