UPDATES  

 నస్పూర్ లో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయండి:ఇల్లందు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రవి*

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరంతరం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తలపెట్టిన పాదయాత్ర మంచిర్యాలకు చేరుకున్న సందర్భంగా ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి తెలిపారు. ఈ బహిరంగ సభకు పెద్దఎత్తున ఇల్లందు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్, భద్రాచలం శాసనసభ్యులు పోదేం వీరయ్య ఆదేశాల మేరకు ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి పిలుపునిచ్చారు. దేశ సంపదను కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్న ప్రధాని మోడీని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ పట్ల బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆయన మండిపడ్డారు. అధాని ఆస్తులపై జేపీసీ వేయాలని కోరిన రాహుల్ గాంధీని సభలో లేకుండా చేసే కుట్రలో భాగమే ఈ అనర్హత వేటు అని, ఎవరెన్ని కుట్రలు పన్నినా న్యాయస్థానాల ద్వారా రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంటులో అడుగుపెడతారని వ్యాఖ్యానించారు. ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నట్లు వారు తెలిపారు. మార్చి 16న పిప్పిరి గ్రామంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మొదలుపెట్టిన పాదయాత్ర ఏప్రిల్ 14న మంచిర్యాలకు చేరుకుంటుందని, భట్టి పాదయాత్ర చేసిన గ్రామాలను పరిశీలిస్తే రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టోచ్చినట్లుగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య, సింగరేణి ప్రైవేటీకరణ, ప్రాణహిత ప్రాజెక్టును నిర్వీర్యం చేయడంతో బీడు భూములుగా మారిన పంట పొలాలు, లక్ష కోట్లు వెచ్చించి కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు కూడా నీరు పారలేదని కాలేశ్వరం ప్రాజెక్టుతో నీట మునుగుతున్న పంట పొలాల సమస్యలు అనేకం వెలుగు చూసాయి అని పేర్కొన్నారు.ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షకు పైగా కార్యకర్తలు తరలి వస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నస్పూర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించే సభకు ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు భారీగా హాజరై ఈ సభను విజయవంతం చేయాలని డాక్టర్ రవి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాణాల శ్రీనివాసరావు, పశిక తిరుమల్, మాజీ కౌన్సిలర్ దారావత్ కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బి.ఎన్ గోపాల్, జిల్లా మహిళ కాంగ్రెస్ కార్యదర్శి కమల, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు ఆనంద్, మహిళా నాయకురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !