UPDATES  

 ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట… – ఈనెల 20న ఇఫ్తార్ విందు. -పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

మన్యం న్యూస్, మణుగూరు ఏప్రిల్ 12: ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన బుధవారం స్థానిక ఇల్లందు గెస్ట్ హౌస్ లో మణుగూరు మండలం ముస్లిం మైనారిటీ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన పినపాక నియోజకవర్గం లోని ముస్లిం సోదరులకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా పేద ముస్లింలకు కానుకలను అందిస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీ యువతుల వివాహాల కోసం షాదీ ముబారక్ పథకం ద్వారా 1 లక్ష 116 రూపాయలు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. 20 న జరిగే ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశాల్లో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాష, బాబ్ జానీ, యూసఫ్ షరీఫ్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !