UPDATES  

 పీకేఓసి బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు సృష్టించాలి* -ఏరియా జిఎం దుర్గం రామచందర్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:ఏప్రిల్ 12

బొగ్గు ఉత్పత్తిలో,రవాణాలో. మణుగూరు పికేఓసి 2022-23 సంవత్సరములో సరికొత్త రికార్డును సృష్టించిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం పీకేఓసి ప్రాంగణంలో కార్మికులు అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జి ఎం మాట్లాడుతూ,నిబద్దతతో కూడిన పని,సంస్కృతిని అలవర్చుకొని,అంకిత భావంతో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతకు పాటు పడటంలో మణుగూరు ఏరియా సింగరేణి ఉద్యోగులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్నారు.అందుకు పీకేఓసి ప్రతి సంవత్సరం సాధిస్తున్న సరికొత్త రికార్డుల పరంపర ఉదాహరణ అని పేర్కొన్నారు.2022-23 సంవత్సరం కు గాను నిర్దేశిత వార్షిక లక్ష్యమైన 96 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 97.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం ఒక రికార్డ్ ఐతే,ఒకే సంవత్సరంలో 104.05 లక్షల టన్నుల బొగ్గును డిస్పాచ్ చేసి ఒకే గని ద్వారా అత్యధిక బొగ్గు రవాణా చేసిన గని గా యావత్ సింగరేణిలోనే సరికొత్త రికార్డు సృష్టించడం మరో విశేషం అన్నారు. భవిష్యత్తులోను పీకేఓసి మరెన్నో రికార్డులు సాధించేందుకు గాను సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్య సాధనకు అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు రక్షణతో పనిచేసి ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని ఆయన కార్మికుల కోరారు.అనంతరం పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ,పీకే ఓసి కి చక్కటి భవిష్యత్ ఉందని,ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.అదేవిధంగా ఇంధనం పొదుపు చేయటం అంటే, మనం ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లేనని,ప్రతి ఒక్క ఆపరేటర్,డ్రైవర్ ఇంధనం పొదుపు చేయాలని కోరారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఆపరేటర్లు రక్షణ పట్ల మరింత అవగాహనతో పని చేయాలని ఆయన తెలిపారు.అనంతరం కార్మికులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.అందరూ సామూహిక రక్షణ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు,ఏరియా గుర్తింపు సంఘం నాయకులు వి. ప్రభాకర్ రావు,ప్రాజెక్ట్ ఇంజనీర్ జే వీరభద్రుడు,ఓసి 2 ఎస్ ఓ ఎం.దండమూడి రాంబాబు, ఓసి-4 మేనేజర్ దేవసాని శ్రీనివాసరావు,జి శంకర్,ఎం నరసింహారావు,బి భాంగ్య, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి సిహెచ్ అశోక్,ఐ శంకర్ సూపర్వైజర్లు కార్మికులు అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !