మన్యం న్యూస్ చర్ల /దుమ్ముగూడెం ::
భద్రాచలం టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నియమించడంతో చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాచలం చర్ల దుమ్ముగూడెం మండలంలో త్వరలో జరిగే బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేయాలని దాని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొసరాజు రాజబాబు సర్పంచ్ కాపుల కృష్ణ అర్జున్ రావు యూత్ అధ్యక్షులు కాకి అనిల్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.