*మన్యంన్యూస్,ఇల్లందు టౌన్
*:వైద్య విధాన పరిషత్ లోకి ఇల్లందు ఆసుపత్రి చేరిన అనంతరం గురువారంతో 120 ఆపరేషన్లు పూర్తి చేసుకున్నట్లు ఇల్లందు ఆసుపత్రి సూపరిండెంట్ శిరీష్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ హర్షవర్ధన్ లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా డీసీహెచ్ రావి బాబు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుధీప్, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ల చొరవతో ఇంత అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. ఈ మేరకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో హరిప్రియ హరిసింగ్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకోసం ఎమ్మెల్యే, కలెక్టర్, డిసిహెచ్ఎస్ లు ప్రత్యేక దృష్టి పెట్టడంతో 120 వివిధ రకాల సర్జరీలు తక్కువ కాలంలో చేసి ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందిస్తున్నామని సూపరిండెంట్, అర్యంఓ లు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్స్ నీ, సిబ్బందిని అభినందించారు. ఈకార్యక్రమానికి సివిల్ సర్జన్ డాక్టర్ రామచంద్రనాయక్ బోస్, హెడ్ సిస్టర్ జగదంబ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
