మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కె పద్మారావు గౌడ్ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలతో పాటు అక్రిడిటేషన్ కార్డులు అందజేయాలని, అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డుల ద్వారా ఉచితంగా వైద్యం అందించాలని జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఆయన జర్నలిస్టుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు గుండెబోయిన వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెలమ రాజేందర్ ఇతరులు పాల్గొన్నారు.