మన్యం న్యూస్ దుమ్ముగూడెం:
బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారి ప్రచార ఆర్భాటం కోసం సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వారికి న్యాయం చేయాలని బిఎస్పి పార్టీ మండల అధ్యక్షులు కంచర్ల సింహాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని బిఎస్పి పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ చీమలపాడు ఘటన కేవలం టిఆర్ఎస్ నాయకులు తప్పిదమని పార్టీ కార్యక్రమంలో జరిగిన సంఘటన కాబట్టి మిత్రులు కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా క్షతగ్రతలకు 50 లక్షల రూపాయలను నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన వారిని టిఆర్ఎస్ పార్టీ నుండి తొలగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనపై బిఎస్పీ ఆధ్వర్యంలో శాంతిపూర్వకంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు బిఎస్పి నాయకులు అక్రమ అరెస్ట్ చేయడం దారుణమని తెలిపారు ముత్తుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ బిఎస్పి పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.