మన్యం న్యూస్ కరకగూడెం: ఖమ్మం జిల్లా మాజి పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,పినపాక మాజి ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు కి మద్దతుగా అయన వర్గనికి చెందిన కొంత మంది బిఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి గా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాల్లవాగు వద్ద ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి ఖమ్మం జిల్లా మాజీ ఎంపి పొంగులేటి. శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాదరణ చూసి నాడు కెసిఆర్ పార్టీ లోకి ఆహ్వానించి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆయనను ఉపయోగించుకోని అనంతరం పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యడంవలన అయనకు మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కరకగూడెం మండలంలోని రాజీనామా చెసిన వారు అనంతారం ఉపసర్పంచ్ అత్తె.సత్యనారాయణ, మాజీ మండల ప్రధాన కార్యదర్శి యర్ర.సురేష్, సమత్ భట్టుపల్లి మాజీ ఎంపీటీసి బిజ్జా. రామనాథం,పద్మాపురం మాజీ సర్పంచ్ పడిగ సమ్మయ్య,వార్డు మెంబర్ గడ్డం రాజేష్,జలగం కృష్ణ,అరెం నరసింహారావు,బరపటి వెంకన్న,భూక్యా రాందాస్,కరకపల్లి నాగేష్,సోలం రామకృష్ణ, పూజారి వెంకన్న, మొడేపు సాంబయ్య మండలము లోని పొంగులేటి అభిమానులు,ముఖ్య కార్యకర్తలు అందరూ కలిసి జై పొంగులేటి జైజై పొంగులేటి,శీనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామని తెలిపారు.
