మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 13, మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలోనీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నూతన బోరు బావిని గ్రామానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం యువజన నాయకుడు లేళ్ళ గోపాలరెడ్డి గురువారం కొబ్బరికాయ కొట్టి డ్రిల్లింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాల రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతర జరుగుతున్నందున ఆలయం వద్ద భక్తులకు నీటి వసతి లేదని, ఆలయ కమిటీ సభ్యులు తన దృష్టికి తీసుకురావడంతో అందరికీ శాశ్వతంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, ఒక మంచి పని చేసే అవకాశం అమ్మవారు నాకు కల్పించిందని అన్నారు. బోరు బావిలో నీరు విజయవంతంగా రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు దాత గోపాలరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు హరీష్, ఆలయ కమిటీ సభ్యులు కాసిన్ని వెంకటేశ్వర్లు, సంగం చిన్నరాజు, బూరం రమేష్, బూరుగు నరసింహారావు, ఘనప వెంకన్న, సంగం లక్ష్మీనారాయణ, పోతిని సత్యం, బూరుగు