UPDATES  

 తోవ చూపించారు సారు రోడ్డు నిర్మాణం ప్రారంభం కలెక్టర్ అనుదీప్ గుంపుగా నామకరణం..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మండలంలోని సుబ్బారావు పేట గ్రామపంచాయతీ లో మద్య గుంపు గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం లేక పొలాల గట్ల మీద వెళ్తూ అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఈ మధ్య గుంపు 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. 60 సంవత్సరాలుగా రోడ్డు మార్గం లేక పాఠశాలకు వెళ్లే చిన్నపిల్లలు అనారోగ్య పరిస్థితులు ఉన్న వృద్ధులు గర్భిణీలు రోడ్డు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు ఇట్టి విషయమై ఫిబ్రవరి 27వ తారీఖున భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ మండల స్థాయి అధికారులకు చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని తెలపగా మండల అధికారులు ప్రజాప్రతినిధులు సమీక్ష సమావేశం నిర్వహించి 60 ఏళ్ల రోడ్డు మార్గ సమస్యను మండల అధికారి చొరవ తో పరిష్కరించారు ఎంపీడీవో చంద్రమౌళి భూమి లబ్ధిదారులతో ప్రభుత్వ పథకాలు భూమి లబ్ధిదారులకి మంజూరు చేయుటకు ఒప్పందం కుదుర్చుకొని వ్యవసాయ భూమిని రోడ్డు నిర్మాణానికి నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై గ్రామ పెద్దల సమక్షంలో రాసి ఇచ్చినారు. అనంతరం గురువారం నాడు ప్రజా ప్రతినిధులు పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో మధ్య గుంపు గ్రామంలో రోడ్డు నిర్మాణం చేయుటకు పనులను ప్రారంభించారు 60 ఏళ్ల నుంచి రోడ్డు మార్గం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు రోడ్డు మార్గం ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతగా మధ్య గుంపు పేరును అనుదీప్ గుంపుగా గ్రామస్తులు తీర్మానం చేసి నామకరణం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళి ఎంపీ ఓ ముత్యాలరావు ఎంపీపీ రేసు లక్ష్మి జడ్పిటిసి సీతమ్మ సర్పంచ్ కన్నారావు ఎంపీటీసీ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !