మన్యం న్యూస్ గుండాల..: మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న పెట్రోల్ బంకులో ఇంధన కొరతతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గోవింద నరసింహారావు అన్నారు. పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లందు డివిజనల్ మేనేజర్ వల్లనే పెట్రోల్ బంకు నిర్వహణ సరిగా ఉండటం లేదని ఇంధనం లేక గిరిజన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డీజిల్ పెట్రోల్ అయిపోయినా కూడా డివిజనల్ మేనేజర్ స్పందించకుండా ఉండడం వల్లనే సమస్య తలెత్తుతుందని అన్నారు. ఈ విషయంపై భద్రాచలం ఐటీడీఏ పిఓపి ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో నివేదిక తీసుకొని ఇల్లందు డివిజనల్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు చింతా వెంకటేశ్వర్లు, పూనెం శ్రీను, మోకాళ్ళ కన్నయ్య, మోకాళ్ళ మహేందర్, రమేష్ , జోషి తదితరులు పాల్గొన్నారు.
