UPDATES  

 బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు

మన్యం న్యూస్ చర్ల :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు ఆధ్వర్యంలో చర్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వెళ్లి చర్ల అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సోయం రాజారావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దళితుల జీవితంలో వెలుగులు నింపే విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టడం భాగంగా,ఎవ్వరూ ఊహించని విధంగా దలితబందు పథకం ద్వారా రాష్ట్రంలో వున్న దళిత కుటుంబాలకు 10 లక్షలు అందించడంతో పాటు, దేశం మొత్తం గర్వించేవిధంగా సచివాలయం సమీపంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ప్రారంభించుకోవడం చాలా సంతోషం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో
చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, ఇరస వడ్ల రాము, మండల కోసరాజు రాజాబాబు, సహాయ కార్యదర్శి ఆలం ఈశ్వర్. సూరిబాబు, తోటమల్ల వరప్రసాద్, తోటపల్లి మాధవరావు, యుత్ అధ్యక్షుడు కాకి అనిల్, తడికల లాలయ్య, దొడ్డి తాతారావు, రమేష్ బాబు, అజీజ్,రాము, తోటమల్ల రవి, సిద్ది రాజశేఖర్, తడికల బుల్లెబ్బాయి, గోరింట్ల వేంకటేశ్వరరావు,అంబోజి సతీష్, తడికల చంద్రశేఖర్,కోంగూరి సోమరాజు, నిరంజన్, రావుల కిషోర్, మరియు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు పాల్గొనడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !