మన్యం న్యూస్, పినపాక:
అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని పినపాక మండలం ఉప్పాక గ్రామంలో ఇటీవల నెలకొల్పిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సబ్బండ కులాలు, దళిత నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రపంచ మేధావి, భారత దేశ దార్శనికుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ అని వక్తలు కొనియాడారు. యుగాలు మారినా, తరాలు మారినా, అంబేద్కర్ లాంటి మహానీయుడు మళ్లీ జన్మించబోడని, భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చదివి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పూనెం సుజాత, ఉప సర్పంచ్ గుంటుపల్లి రామారావు, బోడ లక్ష్మణ్ రావ్,గద్దల వెంకటేశ్వర్లు, బిజ్జం వెంకట్రాంరెడ్డి, ప్రభు కుమార్, శ్యామల సతీష్, దిలీప్, శివశంకర్, రాంబాబు, గుమాస్ గోవర్ధన్, మోటపోతుల నాగేశ్వరరావు గౌడ్, గద్దల సమ్మయ్య, రామచంద్రం, సుమలత, రాణి, సంపత్, గ్రామస్తులు నారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.