మన్యం న్యూస్, మంగపేట.
శుక్రవారం మంగపేట మండల కేంద్రంలోనీ మంగపేట మండల వైయస్సార్ ప్రతిమ ముందు కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతనలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య విచ్చేసి మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత భారతమాత ముద్దుబిడ్డ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించారు. ధనికుడైన,పేదవాడైన ఒక్కటే అని ఓటు హక్కు కల్పించి సమానత్వాన్ని చాటాడు.సమ సమాజ స్థాపనే ధ్యేయంగా అన్ని వర్గాలకు రాజ్యాంగ ఫలాలను అందించారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, ఉపాధ్యక్షులు గాదె శ్రవణ్, ప్రధాన కార్యదర్శి కారు పోతుల నరసయ్య గౌడ్, కార్యదర్శి ఎంపెల్లి సమ్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ లు నర్రా కిషోర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిదాయితుల్లా సీనియర్ నాయకులు తూడి భగవాన్ రెడ్డి, అయ్యోరి యానయ్య, బండ జగన్మోహన్ రెడ్డి,కాటబోయిన నరసింహారావు, ఆకు పవన్, పొదెం నగేష్, కొమరం బాలయ్య, ఎట్టి సారయ్య ,గోనె నగేష్, హరికృష్ణ, ఏం పెళ్లి లాలయ్య యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
