మన్యం న్యూస్ కరకగూడెం: సమాజంలోని నిరుపేదలకు సేవ చేయడంలో ఎంతో తృప్తి దాగి ఉంటుందని ఏడూళ్ల బయ్యారం సీఐ బూర రాజగోపాల్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని పడిగాపురం వలస ఆదివాసీ గ్రామస్తులకు వారి గ్రామంలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా సమక్షంలో సీఐ చేతుల మీదుగా దోమ తెరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సేవాగుణంను అలవర్చుకోని సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయంమని కొనియాడారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు షేక్ సోందుపాషా మాట్లాడుతూ. పేదలకు ఎల్లప్పుడూ సాయపడడంమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యంమని సుమారు 70 దోమ తెరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.అనంతరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సుమారు30 సోలార్ లైట్లు అందజేశారు. కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై జీవన్ రాజు, పోలీస్ సిబ్బంది, ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
