మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ వేపలగడ్డ తండా కి చెందిన గుగులోత్ సక్రియ (65) ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతి పట్ల ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, హరిప్రియ ఫౌండేషన్ ద్వారా మృతుని కుటుంబానికి, దశదినకర్మల నిమిత్తం 1 క్వింటా బియ్యాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, ఇల్లందు పాక్స్ చైర్మన్ మెట్ల కృష్ణ , మండల కో ఆప్షన్ సభ్యులు ఘాజి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక ,స్థానిక వార్డ్ నెంబర్ నందు, చిట్టి బాబు, రమేష్, కౌసల్య, శాంతి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.