డాక్టర్ మనిష్ రెడ్డి,సీఐ కరుణాకర్
మన్యం న్యూస్ గుండాల: గుండెపోటు వచ్చిన వ్యక్తికి సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించ వచ్చని గుండాల ప్రాథమిక వైద్యశాల వైద్యులు మనీష్ రెడ్డి, గుండాల సీఐ కరుణాకర్ సూచించారు. శనివారం మండలం పరిధిలోని ముత్తాపురం గ్రామంలో గుండాల ప్రాథమిక వైద్యశాల నుండి సిపిఆర్ పై డాక్టర్ మనీష్ రెడ్డి పోలీస్ సిబ్బందికి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే సిపిఆర్ చేసి తక్షణమే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తే వారికి ఎటువంటి ప్రాణాపాయం ఉండదని వారు అన్నారు. చాలామందికి సిపిఆర్ ఎలాగో చేయడం తెలియదు కనుక అవగాహన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నట్టు డాక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, ఎస్సై కిన్నెర రాజశేఖర్, రెవెన్యూ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
