మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 15: సీపీఎస్ ఉద్యోగులందరికీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ఇస్లావత్ వీరన్న డిమాండ్ చేశారు. శనివారం పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గిరిజన ఉపాధ్యాయ, సిపిఎస్ ఉద్యోగుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ… ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘం బాధ్యులు ఎం హరిలాల్, సిహెచ్ యుగేందర్ టిటిఎప్ మండల అధ్యక్షులు వీరన్న, రమేష్, బి. కుమారి, తదతరులు పాల్గొన్నారు.